గుడివాడ రోడ్ షో కమ్మ షో అని నీచమైన ప్రచారం చేస్తున్నారు: కొల్లు రవీంద్ర
- కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అన్న రవీంద్ర
- సీట్ కోసం చంద్రబాబు కాళ్ల మీద పడ్డారని ఎద్దేవా
- కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని మండిపాటు
మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడే కొడాలి నాని లాంటి వ్యక్తులకు భూమిపై ఉండే అర్హత లేదని అన్నారు. చంద్రబాబు కాళ్లపై పడి కొడాలి నాని బీఫామ్ తీసుకున్నారని చెప్పారు.
టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతం కావడంతో కొడాలి నానికి కళ్లు బైర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో కొడాలి నానికి అర్థమయిందని, అందుకే పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. గుడివాడకు చంద్రబాబు ఎన్నో మంచి పనులు చేశారని... ఆయన చేసిన ఒకే ఒక చెడ్డ పని కొడాలి నానికి టికెట్ ఇవ్వడమేనని అన్నారు.