దండోరా వేసి 'బలగం' సినిమాను ఫ్రీగా చూపిస్తుండటంపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దండోరా వేసి 'బలగం' సినిమాను ఫ్రీగా చూపిస్తుండటంపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు

Dil Raju police complaint on Balagan movie free shows
  • సంచలన విజయాన్ని నమోదు చేసిన 'బలగం'
  • గ్రామాల్లో ఫ్రీషోలు వేస్తున్న వైనం
  • తమకు నష్టం వస్తుందంటూ నిజామాబాద్ ఎస్పీకి దిల్ రాజు ఫిర్యాదు
జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తొలిసారి దర్శకత్వం వహించిన 'బలగం' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాన్ని కథనంగా తీసుకుని ఈ చిత్రాన్ని వేణు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు, తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఈ చిత్రాన్ని దండోరా వేసి ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. రచ్చబండల దగ్గర, దేవాలయాల్లో ఫ్రీషోలు చూపిస్తున్నారు. 

దీంతో, దిల్ రాజు పోలీసులను ఆశ్రయించారు. గ్రామాల్లో ఉచితంగా సినిమాను ప్రదర్శించడం వల్ల తమకు భారీ నష్టం వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచితంగా సినిమాను ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Advertisement
Dil Raju
Balagam Movie
Free Shows

More Telugu News