చింతకాయల విజయ్ కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ
- సోషల్ మీడియాలో పోస్టులపై సీఐడీ కేసు
- నర్సీపట్నంలోని నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సీఐడీ
- 28న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
సీఐడీ అధికారులు ఇంటికి వెళ్లిన సమయంలో విజయ్ అక్కడ లేరు. దీంతో ఆయన తండ్రి అయ్యన్న పాత్రుడుకి నోటీసులు అందజేశారు. విజయ్ కు మరోసారి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.