Chinthakayala Vijay: చింతకాయల విజయ్ కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ

టీడీపీ యువ నేత, సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో వైఎస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లి ఈ నోటీసులను సీఐడీ అధికారులు అందజేశారు. 

సీఐడీ అధికారులు ఇంటికి వెళ్లిన సమయంలో విజయ్ అక్కడ లేరు. దీంతో ఆయన తండ్రి అయ్యన్న పాత్రుడుకి నోటీసులు అందజేశారు. విజయ్ కు మరోసారి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.
Chinthakayala Vijay
Telugudesam
AP CID

More Telugu News