పెళ్లయ్యాక భార్యకు గుబురు గడ్డం.. తట్టుకోలేక విడాకులిచ్చేసిన భర్త

21-03-2023 Tue 13:53 | Offbeat
Advertisement
  • పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ జీవితంలో అనూహ్య మలుపు
  • పెళ్లయ్యాక పెరిగిన గుబురు గడ్డం..విడాకులిచ్చిన భర్త
  • దైవ ప్రార్థనతో డిప్రెషన్‌‌ నుంచి కోలుకున్న మహిళ
Advertisement
భార్య గుబురు గడ్డాన్ని తట్టుకోలేక ఓ భర్త విడాకులు ఇచ్చేశాడు. భర్త తిరస్కరణతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయింది. ఆ తరువాత ఆమె పరిస్థితులతో రాజీపడటం నేర్చుకుని క్రమంగా కోలుకుంది. ఇటీవలే మీడియాతో తన జీవిత విశేషాలను పంచుకుంది. పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్‌కు 2012లో వివాహం జరిగింది. వివాహానికి ముందు ముఖంపై రోమాలే ఎరుగని ఆమె పరిస్థితి ఆ తరువాత ఒక్కసారిగా మారిపోయింది. క్రమంగా వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. చూస్తుండగానే ముఖంపై గుబురు గడ్డం ప్రత్యక్షమైంది. ఈ పరిణామాలను తట్టుకోలేని ఆమె భర్త విడాకులిచ్చేశాడు. ఇలా అనూహ్యంగా జీవితం తలకిందులు అవడంతో మన్‌దీప్ తీవ్ర దుఃఖంలో కూరుకుపోయింది. 

అయితే.. బతుకంతా నిరాశలోనే గడిపేయద్దనుకున్న ఆమె తనలోని మార్పులను సానుకూల ధోరణితో స్వీకరించింది. దైవ ప్రార్థనతో ప్రతికూల భావాలను తొలగించుకుంది. రోజూ గురుద్వారాకు వెళ్లడంతో తనలో మార్పు మొదలైందని మన్‌దీప్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె గడ్డం తీసుకోవడం కూడా మానేసింది. తనను తొలిసారి చూసిన వారందరూ పురుషుడే అనుకుంటారని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మగాళ్లలాగానే బైక్ నడుపుతానని, తన సోదరులతో కలిసి పొలం పనులకు వెళతానని కూడా ఆమె వివరించింది. ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గతంలోనూ కొందరు మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. బ్రిటన్‌లో స్లో ప్రాంతానికి చెందిన హర్‌నామ్‌ కౌర్‌కు పాలీసిస్టిక్ ఓవరీస్ అనే వ్యాధి ఉంది. దీంతో.. చిన్న వయసులోనే ఆమె ముఖంపై రోమాలు మొలవడం ప్రారంభించాయి. తన పదకొండవ ఏటనే ఈ సమస్య మొదలైంది. రోమాలను తొలగించుకునేందుకు ఆమె తరచూ వ్యాక్సింగ్ చేసేది. కొన్నేళ్ల పాటు ఇలా చేసి విసిగిపోయిన హర్‌నామ్ చివరకు పరిస్థితులకు అలవాటు పడటడమే కాకుండా, తన గడ్డాన్ని గర్వంగా ప్రదర్శించేందుకు నిశ్చయించుకుంది.
Advertisement
Punjab

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more