తారకరత్న పేరుతో గుండె సమస్యలకు బాలకృష్ణ ఉచిత వైద్యం... తీవ్ర భావోద్వేగానికి గురైన అలేఖ్య రెడ్డి
- తారకరత్న మరణంతో చలించిపోయిన బాలకృష్ణ
- బసవతారకం ఆసుపత్రిలో ఒక వార్డుకు తారకరత్న పేరు
- గుండె సమస్యలతో బాధ పడుతున్న పేదలకు ఉచిత చికిత్స
- మీలో దేవుడిని చూసుకుంటున్నానన్న అలేఖ్య రెడ్డి
- మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని వ్యాఖ్య
మరోవైపు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరోసారి బాలయ్య గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమె స్పందిస్తూ... 'నేను ఏమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞలను ఎలా తెలియజేయగలను. మీ గురించి ఏది చెప్పినా తక్కువే అవుతుంది. బంగారు హృదయం కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పడం ఎంతమాత్రం ఆశ్చర్యకరం కాదు. మీకు ఎవరూ సాటి కాదు. మీరు ఒక స్నేహితుడు, తండ్రి కంటే ఎక్కువ. ఇప్పుడు మీలో దేవుడిని చూసుకుంటున్నాను. మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నా హృదయాంతరాల్లో నుంచి మీకు ధన్యవాదాలు చెపుతున్నాను. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో... అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జై బాలయ్య' అంటూ ఎంతో భావోద్వేగంగా ఆమె స్పందించారు. అఖండ సినిమాలో అఘోరా రూపంలో ఉన్న బాలయ్య ఫొటోను షేర్ చేశారు.