'రంగ మార్తాండ' నుంచి హుషారైన బీట్!

Ranga Marthanda movie lyrical song released
  • కృష్ణవంశీ రూపొందించిన 'రంగ మార్తాండ'
  • రంగస్థల నటుడి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది 
  • కీలకమైన పాత్రలో బ్రహ్మానందం 
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ నెల 22వ తేదీన సినిమా రిలీజ్
కృష్ణవంశీ సినిమాలలో వినోదంతో పాటు సందేశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక పాత్రలను ఆయన మలిచే విధానం .. నడిపించే తీరు మనసును తాకుతూ ఉంటుంది. అలా ఆయన రూపొందించిన సినిమానే 'రంగ మార్తాండ'. ఇది ఒక రంగస్థల కళాకారుడి జీవితం చుట్టూ తిరిగే కథ. 

ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. తాజాగా 'దమిడి సేమంతి' అనే మరో పాటను రిలీజ్ చేశారు. ప్రకాశ్ రాజ్ .. రాహుల్ సిప్లి గంజ్ తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. ఒక పార్టీ సందర్భంలో ఈ పాట వస్తుందనే విషయం అర్థమవుతోంది.

'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, అనసూయ .. రాహుల్ సింప్లి గంజ్ .. శివాత్మిక రాజశేఖర్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Advertisement
Prakash Raj
Ramya Krishna
Brahmanandam
Ranga Marthanda Movie

More Telugu News