ఎన్టీఆర్ 30వ సినిమా కోసం భారీ సెట్స్ .. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..!
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ 30వ సినిమా కోసం భారీ సెట్స్ .. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..!

Ntr and koratala movie update
  • కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా  
  • ఈ నెల 23న జరగనున్న పూజ కార్యక్రమాలు 
  • ఈ నెల 30 నుంచి రెగ్యులర్ షూటింగు మొదలు 
కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని అందుకుంది. దాంతో సహజంగానే ఈ ఇద్దరి కాంబోగా రానున్న సినిమా అందరిలో ఆత్రుతను పెంచుతోంది. 

ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కాస్త ఫ్రీ అయ్యాడు. అందువలన ఈ నెల 23వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సమాచారం. రెగ్యులర్ షూటింగును ఈ నెల 30 నుంచి మొదలుపెడతారట. 

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెట్స్ ను వేయించారని అంటున్నారు. రామ్ -  లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చిత్రీకరణతో ఫస్టు షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో తలపడే విలన్ పాత్రలో 'సైఫ్ అలీ ఖాన్' కనిపించనున్నాడని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను 9 భాషల్లో రిలీజ్ చేయనున్నారని సమాచారం. 

Advertisement
Ntr
Koratala Siva
Tollywood

More Telugu News