Balakrishna: బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

YSRCP MLA Gopireddy counter to Balakrishna
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్త బాలయ్య పాటను పెట్టడంపై గోపిరెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని... సదరు ఎమ్మెల్యే ఈ చర్యతో ఆయన స్థాయిని దిగజార్చుకున్నారని బాలయ్య అన్నారు. సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆయనకంటే పెద్ద మూర్ఖుడు ఎవరైనా ఉన్నారా? అని మండిపడ్డారు. 

ఈ వ్యాఖ్యలపై గోపిరెడ్డి స్పందిస్తూ... తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరని ప్రశ్నించారు. బాలయ్య పెద్ద హీరో అయితే అది టీడీపీకి గొప్ప అని... తనకు కాదని అన్నారు. బాలకృష్ణ కూడా ఒక మనిషే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని బాలయ్య మాట్లాడాలని అన్నారు. సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో కూడా నటించడం కుదరదని చెప్పారు.
Go Back to Shorts
Balakrishna
Telugudesam
Gopireddy
YSRCP

More Telugu News