ప్రశ్నాపత్రాల లీక్ నిందితుడు ప్రవీణ్ ఫోన్లో అన్నీ అలాంటి దృశ్యాలే!

14-03-2023 Tue 15:27 | Telangana
Advertisement
  • ప్రవీణ్ కు స్త్రీలంటే పిచ్చి అని గుర్తించిన పోలీసులు!
  • అతడి ఫోన్ లో అశ్లీల దృశ్యాలు, నగ్న ఫొటోలు!
  • టీఎస్ పీఎస్సీకి వచ్చే మహిళలతో పరిచయాలు
  • వారిలో పలువురితో ప్రవీణ్ కు శారీరక సంబంధం
Advertisement
తెలంగాణలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీక్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల ప్రశ్నాపత్నం లీకేజి కూడా ప్రవీణ్ పనే అని భావిస్తున్నారు. ఇందులో రేణుక అనే ఉపాధ్యాయురాలి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు. 

ప్రవీణ్ టీఎస్ పీఎస్సీ ఉద్యోగి. 2017లో జూనియర్ అసిస్టెంట్ గా చేరాడు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రవీణ్ టీఎస్ పీఎస్సీలో వెరిఫికేషన్ విభాగంలో పనిచేసినప్పుడు, అప్లికేషన్లలో పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చే మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. 

అప్లికేషన్లలోని సమస్యలను పరిష్కరించి, వారి ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. వారిలో కొందరితో ప్రవీణ్ శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నట్టు తెలిసింది. అతడి సెల్ ఫోన్ నిండా మహిళలతో కలిసి ఉన్న అశ్లీల దృశ్యాలు, మహిళల అసభ్య ఫొటోలు, మహిళల వాట్సాప్ నెంబర్లు గుర్తించారు. ప్రవీణ్ కు స్త్రీలంటే పిచ్చి అని అంచనాకు వచ్చారు. 

ప్రవీణ్ కు ఏడాది కిందట టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పీఏగా ప్రమోషన్ లభించింది. ఉన్నతాధికారుల వద్ద అతడు ఎంతో విధేయుడిగా మెలుగుతూ, వారి నమ్మకాన్ని పొందాడు. అధికారుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని ప్రవీణ్ పేపర్ లీకేజికి తెరలేపినట్టు భావిస్తున్నారు. 

కాగా, నిందితులు ప్రవీణ్, రేణుకల ఫోన్ లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇద్దరి మధ్య జరిగిన పూర్తి చాటింగ్ ను రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Advertisement
PravinTSPSCQuestion PapersLeak

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more