రోడ్లపై తిరిగాను .. అరుగులపై పడుకున్నాను: 'బలగం' వేణు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్లపై తిరిగాను .. అరుగులపై పడుకున్నాను: 'బలగం' వేణు

Venu Interview
  • కమెడియన్ గా వేణుకి మంచి గుర్తింపు
  • 'బలగం' సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నం
  • ప్రశంసలు తెచ్చిపెడుతున్న సినిమా 
  • కెరియర్ తొలినాటి ముచ్చట్లు చెప్పిన వేణు 
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు, 'బలగం' సినిమాతో డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకున్నాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా వేణును మెగాస్టార్ తన షూటింగు సెట్ కి ఆహ్వానించి అభినందించిన విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ, "సినిమాల్లో నటించాలనేదే నా ఆశయం .. అందుకోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఉండేది. అందువలన బ్రతకడం కోసం చాలా పనులు చేస్తూ వెళ్లాను" అన్నాడు. 

'చిత్రం' శ్రీను దగ్గర రెండేళ్లు టచప్ బాయ్ గా చేశాను .. మేకప్ అసిస్టెంట్ గా చేశాను .. సినిమా సెట్స్ కి సంబంధించి రోజుకి 70 రూపాయలకు పనిచేశాను. అప్పుడు రూమ్ కూడా ఉండేది కాదు .. రోడ్లపై తిరగడం .. అరుగులపై పడుకోవడం చేసేవాడిని. అన్నదానాలు జరుగుతూ ఉంటే వెళ్లేవాడిని. నాలాగే పారిపోయి వచ్చిన వాళ్లు చాలామంది ఉండేవారు. మేమంతా కూడా బ్యాచులు బ్యాచులుగా తిరుగుతూ ఉండేవాళ్లం" అని చెప్పాడు. 

"సినిమాల్లోకి వెళ్లాలంటే సినిమాలతో పరిచయం ఉన్నవారితో మనకి పరిచయం ఉండాలనే విషయం నాకు అర్థమైంది. అలాంటివారిని చూసుకుని, వాళ్లకి అన్నం వండిపెడతాను .. బట్టలు ఉతుకుతానని చెప్పాను. దాంతో ఒక బాయ్ గా నేను ఆ రూమ్ లో ఉండటానికి అంగీకరించేవారు. అలా సినిమాల్లోకి వెళ్లాను" అంటూ చెప్పుకొచ్చాడు. 
Advertisement
Venu
Dil Raju
Balagam Movie

More Telugu News