బాలకృష్ణ రాలేదని మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకుంటున్నాడు!
Add ap7am to your home Screen

బాలకృష్ణ రాలేదని మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకుంటున్నాడు!

Balakrishna fan postponing marriage since 3 years
  • 2019లో పెద్దినాయుడు, గౌతమిల ఎంగేజ్ మెంట్
  • వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలయ్యకు వెడ్డింగ్ కార్డ్ పంపిన వైనం
  • వివిధ కారణాల వల్ల రాలేకపోయిన బాలయ్య
సినిమా హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అభిమాన హీరోల కోసం ఏమైనా చేయడానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ సిద్ధపడతారు. తమ హీరోల సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. బ్యానర్స్ పెట్టడం, క్షీరాభిషేకాలు చేయడం వంటివి ఎన్నో చేస్తుంటారు. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఇంకో మెట్టుపైనే ఉంటారని చెప్పుకోవచ్చు. తాజాగా బాలయ్య అభిమాని ఒకరు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య వస్తేకానీ పెళ్లి చేసుకోనని మూడేళ్లుగా భీష్మించుకుని కూర్చున్నాడు ఒక అభిమాని. 

బాలయ్యను అమితంగా ప్రేమించే ఆ అభిమాని పేరు కోమలి పెద్దినాయుడు. ఆయనది విశాఖపట్నం జిల్లా పెందుర్తి. ఆయనకు గౌతమీప్రియ అనే అమ్మాయితో 2019లోనే ఎంగేజ్ మెంట్ అయిపోయింది. గౌతమి కూడా బాలయ్య అభిమానే కావడం గమనార్హం. తన పెళ్లికి రావాల్సిందిగా వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలయ్యను పెద్దినాయుడు ఆహ్వానించాడు. అయితే బిజీ వల్ల బాలయ్య రాలేకపోయారు. ఆ తర్వాత కరోనా రావడంతో అన్నీ ఆగిపోయాయి. తాజాగా ఆయన పెళ్లికి మరో మూహూర్తం ఫిక్స్ చేశాడు. ఈసారైనా బాలయ్య వస్తారని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఊరంతా సిద్ధమవుతున్నారట. మరి బాలయ్య ఈసారైనా వెళ్తారేమో వేచి చూడాలి.
Advertisement
Balakrishna
Fan
Marriage

More Telugu News