జనసేన పార్టీని హైదరాబాదులో వేలం వేస్తున్నారు: అంబటి రాంబాబు వ్యంగ్యం
- జనసేన అమ్ముడుపోయే సేన అన్న అంబటి
- ఎవరు పాడుకుంటే వారితో పోతారని వ్యంగ్యం
- కాపులకు పట్టిన శని జనసేన అంటూ వ్యాఖ్యలు
- జనసేనను నమ్మితే మునిగిపోతారన్న మంత్రి
"కొందరు కులతత్వ వాదులు... మా వాళ్లే... పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అంటూ గోక్కుంటున్నారు.... కొంప ముంచేస్తాడు. సర్వనాశనం చేయడానికి పుట్టాడు. కాపుల గుండెల్లో కుంపటి, కాపులకు పట్టిన శని జనసేన. జనసేనను నమ్మితే మునిగిపోతారు" అని అంబటి వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీని నమ్మవద్దని... బీజేపీకో, బీఆర్ఎస్ కో, టీడీపీకో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ జనసేన అని అంబటి రాంబాబు ఉద్ఘాటించారు.