ఎన్టీఆర్ మాదిరిగా నేను కూడా నియమనిష్ఠలు పాటించేదానిని: నటి కేఆర్ విజయ

KR Vijaya Interview
  • దేవత పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ కేఆర్ విజయ్
  • 3వ తరగతితోనే చదువు ఆగిపోయిందని వివరణ 
  • తన భర్త ప్రోత్సాహం ఉందని వెల్లడి 
  • తన తరం ఆర్టిస్టులు టచ్ లోనే ఉన్నారని వ్యాఖ్య  
తెలుగు తెరపై దేవత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా కేఆర్ విజయ కనిపిస్తారు. అప్పట్లో దేవత పాత్ర అంటే ముందుగా వినిపించే పేరు ఆమెదే. అలాంటి కేఆర్ విజయ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నటన అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. అందువలన చిన్నప్పటి నుంచి నాతో నాటకాలు .. డ్రామాలు వేయిస్తూ ఉండేవారు. అందువలన 3వ తరగతికి మించి చదువు సాగలేదు" అని చెప్పారు.  

"ఎన్టీ రామారావుగారు దేవుడి పాత్రలు చేసేటప్పుడు ఎంతో నియమనిష్ఠలను పాటించేవారు. నేను కూడా అలాగే చేసే దానిని. షూటింగుకు ముందు అమ్మవారి గుడికి వెళ్లి ఆ తల్లి ఆశీస్సులు తీసుకునేదానిని. ఆ షూటింగు పూర్తయ్యేవరకూ శాకాహారిగా ఉండేదానిని. నేను ఎక్కడికి వెళ్లినా అమ్మవారిగా భావించి నన్ను గౌరవిస్తూ ఉండేవారు" అని చెప్పారు.

"వివాహమైన తరువాత కూడా నటించమని మా వారే నన్ను ప్రోత్సహించారు. అందువల్లనే నేను ఇన్ని సినిమాలు చేయగలిగాను. మా అమ్మాయి మా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది .. అల్లుడు 'అపోలో'లో డాక్టర్. అప్పట్లో నాతో పాటు నటించిన శారద .. కాంచన .. రాజశ్రీ .. షావుకారు జానకి అంతా కూడా కాల్ చేస్తూనే ఉంటారు" అని చెప్పుకొచ్చారు. 

Advertisement
KR Vijaya
NTR
Tollywood

More Telugu News