దేశానికి కీర్తి తెచ్చిన ఇద్దరు వ్యక్తులను మోదీ జైలుకు పంపారు: కేజ్రీవాల్

Kejriwal fires on Modi
  • సిసోడియా, సత్యేంద్ర జైన్ దేశానికి ఎంతో కీర్తిని తెచ్చారన్న కేజ్రీవాల్
  • ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుంభకోణం జరగలేదన్న కేజ్రీ
  • ఇందిర మాదిరి మోదీ వ్యవహరిస్తున్నారని మండిపాటు
ఆప్ కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ఇద్దరు వ్యక్తులు దేశానికి ఎంతో కీర్తిని తెచ్చారని... అలాంటి వ్యక్తులను మోదీ జైలుకు పంపారని దుయ్యబట్టారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కుంభకోణం ఏమీ జరగలేదని... దీన్ని ఒక సాకుగా చూపి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. 

విద్యా రంగంలో సిసోడియా, వైద్య రంగంలో సత్యేంద్ర జైన్ మంచి పనులు చేయడమే వారి అరెస్టులకు కారణమని అన్నారు. సిసోడియా బీజేపీలో చేరితే రేపటికి రిలీజ్ అవుతారని చెప్పారు. బీజేపీలో చేరితే ఆయనపై అన్ని కేసులను ఉపసంహరించుకుంటారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారో ఇప్పుడు మోదీ అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని... ప్రజలే సమాధానం చెపుతారని అన్నారు. 

Advertisement
Arvind Kejriwal
AAP
Narendra Modi
BJP

More Telugu News