దివాలా అంచున ఉన్న పాక్‌ను ఆదుకున్న చైనా.. 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం
- పాక్‌కు రుణం ఇచ్చేందుకు చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు అంగీకారం
- మరో వారం రోజుల్లో పాకిస్థాన్‌కు అందనున్న రుణం
- ఊపిరి పీల్చుకున్న పాక్
మరో వారం రోజుల్లో ఈ సొమ్ము పాకిస్థాన్‌కు అందనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఈ నెల 10 నాటికి పాక్ సెంట్రల్ బ్యాంకు వద్ద 3.2 బిలియన్ డాలర్లు మాత్రమే మిగిలాయి. ఆ సొమ్ము ఆ దేశ దిగుమతులకు 3 వారాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉండడంతో దిగుమతులపై పాక్ నిషేధం విధించింది. ఇప్పుడు చైనా ఆర్థిక సాయంతో ఆ దేశం ఊపిరి పీల్చుకుంది.