తప్పయిపోయింది క్షమించండి.. మహిళా కమిషన్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివరణ
- గవర్నర్ కు లేఖ ద్వారా క్షమాపణ కోరతానని వెల్లడి
- మంగళవారం ఢిల్లీ వెళ్లి కమిషన్ ముందు హాజరైన ఎమ్మెల్సీ
- మరోమారు గవర్నర్ ను కించపరచబోనని వివరణ
గవర్నర్ తమిళిసై పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ వెళ్లిన కౌశిక్ రెడ్డి.. జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మరోసారి గవర్నర్‌ను కించపరుస్తూ మాట్లాడబోనని, తిరిగి వెళ్లాక గవర్నర్ ను లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరతానని చెప్పారు. ఆ లేఖను కమిషన్ కు కూడా పంపిస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్పారు.