Mahesh Babu: వెయ్యికోట్ల బడ్జెట్ .. 30 భాషల్లో మహేశ్ తో రాజమౌళి మూవీ!

Mahesh and Rajamouli movie update
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి నుంచి వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందింది. సినీ మేథావుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. 450 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 1250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో రాజమౌళి రూపొందించనున్న తరువాత సినిమాపై అందరూ దృష్టిపెట్టారు. 

రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండనుంది. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా సమాచారం. అందుకు తగిన మార్కెటింగ్ ను కూడా ముందుగానే మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. 

ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే దాదాపు 30 భాషల్లోని ప్రేక్షకులకు ఈ సినిమా చేరువయ్యేలా ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకునే రాజమౌళి రంగంలోకి దిగుతాడనే విషయం తెలిసిందే. 

Go Back to Shorts
Mahesh Babu
Rajamouli
Vijayendra Prasad

More Telugu News