ఫిలిం ఛాంబర్ కు తారకరత్న భౌతికకాయం తరలింపు... పక్కనే కూర్చున్న బాలకృష్ణ, విజయసాయిరెడ్డి
- మోకిలలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు భౌతికకాయం తరలింపు
- అంబులెన్సును అనుసరిస్తున్న 200 వాహనాలు
- సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
అంబులెన్స్ వెనుక దాదాపు 200 వాహనాలు అనుసరిస్తున్నాయి. 10 గంటలకు పార్థివదేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానానికి అంతిమయాత్ర కొనసాగుతుంది. మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలను నిర్వహిస్తారు. మరోవైపు, ఈ ఉదయం 8 గంటలకు తారకరత్న భౌతికకాయానికి ఆయన కుమారుడి చేత అంతిమ క్రతువులను నిర్వహించారు.