టీ20ల్లో వికెట్ల ‘శతకం’.. అరుదైన రికార్డు సృష్టించిన భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ
- అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ గా ఘనత
- భారత పురుషుల జట్టులోనూ ఎవ్వరూ సాధించని రికార్డు ఆమె ఖాతాలోకి
- టీ20 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ పై గెలిచిన భారత మహిళలు
లక్ష్య ఛేదనలో భారత్ 18.1 ఓవర్లలో 119/4 స్కోరు చేసి గెలిచింది. రిచా ఘోష్ కు తోడు హర్మన్ ప్రీత్ (42 బంతుల్లో 3 ఫోర్లతో 33), షెఫాలీ వర్మ (28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన దీప్తి శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన భారత తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. భారత పురుషుల జట్టులోనూ ఎవ్వరూ ఈ ఘనత అందుకోలేకపోయారు. మహిళా జట్టులో పూనమ్ యాదవ్ 98 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. పురుషుల జట్టులో స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ 91 వికెట్లతో ఉన్నాడు.