మా నమ్మకం నువ్వే జగన్... ఏపీలో ఈ నెల 11 నుంచి వైసీపీ కొత్త కార్యక్రమం
- రాష్ట్రంలో వైసీపీ కొత్త కార్యక్రమం
- ఇంటింటికీ వెళ్లనున్న వలంటీర్లు, గృహ సారథులు
- ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలపై వివరాల సేకరణ
- ఇంటి యజమాని అనుమతితో స్టిక్కర్ అతికించనున్న వైనం
అయితే, స్టిక్కర్ అతికించేముందు ఇంటి యజమాని నిర్ణయం అడుగుతారు. ఇంటి యజమాని అంగీకరిస్తేనే స్టిక్కర్ ను అతికిస్తారు.
కాగా, ఏపీలో ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ఉండగా, కొత్తగా ప్రతి 50 ఇళ్లకు ఒక గృహ సారథిని నియమిస్తున్నారు. వైసీపీ నూతన కార్యక్రమంలో ఈ గృహ సారథులు కీలకపాత్ర పోషించనున్నారు. కాగా, 'జగనన్నకు చెబుదాం' అనే మరో కార్యక్రమానికి కూడా అధికారపక్షం రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది.