పాక్ మసీదులో ఉగ్రదాడి ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య
- పెషావర్ లోని మసీదులో సోమవారం మధ్యాహ్నం దాడి
- పేలుడు ధాటికి కూలిన మసీదు గోడ
- శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలు
మరో 150 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. పేలుడు ధాటికి మసీదు గోడలో కొంతభాగం కూలిపోయింది. ఆ శిథిలాల కింద చిక్కుకుని చాలామంది చనిపోయారు. పేలుడు తర్వాత అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయని తెలిపారు.
మంగళవారం ఉదయం కూడా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ పేలుడుకు పాల్పడింది తమ ఆత్మాహుతి దళ సభ్యుడేనని తెహ్రీక్-ఐ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ సోమవారం ప్రకటించుకుంది. సిటీలోని పోలీస్ కార్యాలయం ఆవరణలో అత్యంత భద్రత ఉండే చోట పేలుడు జరగడంపై అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.