ప్రభుత్వ ఉద్యోగి భార్యగా కావాలి.. కట్నం ఇచ్చుకుంటానంటూ ప్లకార్డుతో నిలబడ్డ యువకుడు.. అసలు విషయం ఏమిటంటే..!
- మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
- ప్లకార్డుపై కావాల్సిన భార్య అర్హతలు రాస్తూ నిలబడిన యువకుడు
- ఇదంతా వినోదం కోసమే చేసినట్టు తర్వాత వెల్లడి
ఇంతకీ ఆ ప్లకార్డులో ఏముందని అనుకుంటున్నారు..? ‘‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నాకు కావాలి. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి అమ్మాయికి నేను కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని రాసి ఉంది. మంచి ఉద్యోగం చేస్తున్న అల్లుడు లభిస్తే కట్నం ఇచ్చేందుకు అమ్మాయి తల్లిదండ్రులు వెనుకాడరు. కానీ, తనకు నచ్చిన అమ్మాయి కోసం ఇతడు ఎదురు కట్నం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే, విషయం ఏమిటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లాడేందుకు వికల్ప్ మాల్వి ఈ పనిచేయలేదట. అందరినీ నవ్వించడం కోసం భిన్నంగా అలా చేశానని, తనను ప్రశ్నించిన వారికి చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. తరచూ ఇలా ఏదో ఒక వీడియో చేస్తుండడం అతడి వ్యాపకం.