సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఐసీసీ.. రూ. 20 కోట్లకు కుచ్చుటోపీ
- అమెరికా నుంచి గతేడాది మోసం
- అధికారికంగా స్పందించని ఐసీసీ
- అంతర్గత విచారణ జరుపుతున్న వైనం
కొన్ని కొనుగోళ్ల విషయమై అమెరికాకు చెందిన ఓ సంస్థకు ఐసీసీ చెల్లింపులు చేసింది. కానీ, అది తప్పుడు సంస్థ అని తెలిసి షాక్ కు గురైంది. ఐసీసీ కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఓ ఐడీతో మోసగాళ్లు ఈ తతంగం నడిపించారు. దాంతో, ఐసీసీ గుడ్డిగా నమ్మి చెల్లింపులు జరిపింది. ఏకంగా మూడుసార్లు చెల్లింపులు జరిపి 2.5 మిలియన్ డాలర్లు మోసపోయింది. విదేశాల్లో బిజినెస్ ఈ–మెయిల్ (బీఈసీ) మోసాలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. కానీ, ఆర్థికంగా ఎంతో బలమైన, పటిష్ఠ వ్యవస్థ కలిగిన ఐసీసీ మోసపోవడం చర్చనీయాంశమైంది.