అధికారం కోసమే నారా లోకేశ్ పాదయాత్ర: కాకాణి గోవర్ధన్
- ఈ నెల 17 నుంచి లోకేశ్ యువ గళం పాదయాత్ర
- ఆయన గళాన్ని ఎవరు వింటారో చూడాలన్న కాకాణి
- లోకేశ్ గళం వినే స్థితిలో రాష్ట్ర యువత లేదని వ్యాఖ్య
కేవలం అధికారం కోసమే పాదయాత్రను చేపడుతున్నారని విమర్శించారు. గతంలో ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధించారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.