టీడీపీలో చేరుతున్న మంగళగిరి వైసీపీ నేత
- టీడీపీలో చేరుతున్న మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు
- నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్న వైనం
- వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న శ్రీనివాసరావు
కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరుతున్న సందర్భంగా మంగళగిరిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల శైలిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. వాస్తవానికి కాండ్రు శ్రీనివాసరావు వైసీపీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు కానీ, సముచిత స్థానం కానీ లభించలేదని ఆయన అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.