నాలుగో ఫ్లోర్ నుంచి కిందపడిన లిఫ్ట్.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న అజిత్ పవార్
- మహారాష్ట్రలోని పూణెలో ఘటన
- ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వెళ్లిన అజిత్ పవార్
- ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో పవార్‌తోపాటు 90 ఏళ్ల వైద్యుడు
బారామతిలో తాను ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్టు అజిత్ పవార్ తెలిపారు. ప్రమాద సమయంలో తనతోపాటు 90 ఏళ్ల వైద్యుడు డాక్టర్ రెడీకర్, పోలీసులు కూడా లిఫ్ట్‌లో ఉన్నట్టు చెప్పారు. తాము లిఫ్ట్‌లోకి వెళ్లిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆ వెంటనే లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి వేగంగా కిందపడిందని వివరించారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు.
ఆ తర్వాత లిఫ్ట్ డోర్‌ను బద్దలుగొట్టడంతో తామంతా సురక్షితంగా బయటపడినట్టు తెలిపారు. ప్రమాదం విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేదని అజిత్ పవార్ పేర్కొన్నారు. లేదంటే నిన్ననే ఈ విషయం బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.