విదేశీ గడ్డపై ఆర్ఆర్ఆర్ హవా... మరో అవార్డు అందుకున్న కీరవాణి
Add ap7am to your home Screen

విదేశీ గడ్డపై ఆర్ఆర్ఆర్ హవా... మరో అవార్డు అందుకున్న కీరవాణి

RRR wins Los Angeles Film Critics award for best music
  • అమెరికాలో ఆర్ఆర్ఆర్ మేనియా
  • ఇటీవల 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
  • తాజాగా లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
  • ఉత్తమ సంగీతం కేటగిరీలో పురస్కారం
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వ నైపుణ్యానికి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నటనా ప్రతిభకు మచ్చుతునకలా నిలిచిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కుంభవర్షం కురిపించిన ఈ చిత్రం అవార్డుల పరంగానూ దూసుకెళుతోంది. 

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల రిమైండర్ జాబితాలో చోటుదక్కించుకున్న ఆర్ఆర్ఆర్ కు అమెరికాలో నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రంలో 'నాటు నాటు' పాటకు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించడం తెలిసిందే. తాజాగా బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు కూడా వరించింది. 

ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. కీరవాణికి అభినందనలు తెలిపింది.
Advertisement
RRR
Los Angeles Film Critics Award
Best Music
MM Keeravani
Rajamouli
Ram Charan
Jr NTR

More Telugu News