హృతిక్ రోషన్ పై గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్... వివరణ ఇచ్చిన రాజమౌళి
Add ap7am to your home Screen

హృతిక్ రోషన్ పై గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్... వివరణ ఇచ్చిన రాజమౌళి

Rajamouli explains his comments on Hritik Roshan
  • గతంలో బిల్లా ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి వ్యాఖ్యలు
  • ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అంటూ కామెంట్
  • 15 ఏళ్ల నాటి వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్
  • తాను హృతిక్ ను కించపర్చాలని ఆ మాటలు అనలేదన్న రాజమౌళి
గతంలో ప్రభాస్ నటించిన బిల్లా చిత్రం ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ధూమ్-2లో హృతిక్ రోషన్ ను చూశాను... కానీ బిల్లా ట్రైలర్ చూశాక ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అంటూ రాజమౌళి ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. 

ఆ వీడియో ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడంతో రాజమౌళి వివరణ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉరకలేస్తున్న నేపథ్యంలో, అమెరికాలో ఉన్న రాజమౌళి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ హృతిక్ రోషన్ పై వ్యాఖ్యల విషయాన్ని ప్రస్తావించారు. 

ఆ వ్యాఖ్యలు తాను 15 ఏళ్ల కిందట చేశానని, ఆ వీడియో ఇప్పుడెందుకు వైరల్ అవుతోందో తెలియడంలేదని అన్నారు. అయితే ఆ ఫంక్షన్ లో తాను మాట్లాడిన మాటలు సరికాదని అంగీకరిస్తున్నానని వినమ్రంగా తెలిపారు. హృతిక్ రోషన్ ను అవమానించాలన్న ఉద్దేశంతో తాను ఆ మాటలు అనలేదని, అతడంటే తనకు చాలా గౌరవం అని రాజమౌళి స్పష్టం చేశారు. 

రాజమౌళి నిజాయతీగా చెప్పిన ఈ మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి మంచి మనసుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని కొనియాడుతున్నారు. తప్పును అంగీకరించడం ద్వారా రాజమౌళి తన గొప్పదనాన్ని ఘనంగా చాటుకున్నారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Advertisement
Rajamouli
Hritik Roshan
Billa
Audio Function

More Telugu News