కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్

Threatening calls to union minister Nitin Gadkari
  • నాగపూర్ లో గడ్కరీ కార్యాలయానికి మూడు బెదిరింపు కాల్స్
  • కొద్ది వ్యవధిలోనే కాల్స్ చేసి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తులు
  • అప్రమత్తమైన పోలీసులు
  • గడ్కరీ కార్యాలయానికి బందోబస్తు పెంపు
నాగపూర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నేడు కొద్ది వ్యవధిలో మూడు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తొలుత 11.25 గంటలకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు, ఆ తర్వాత 11.32 గంటకు, 12.32 గంటలకు ఫోన్ చేసినట్టు గుర్తించారు. 

హుటాహుటీన గడ్కరీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బెదిరింపు కాల్స్ పై విచారణ చేపట్టారు. కాల్ రికార్డులను సేకరించారు. నాగపూర్ లోని గడ్కరీ కార్యాలయం వద్ద బందోబస్తు పెంచారు. 

ఈ కాల్స్ బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ నుంచి వచ్చినట్టు నాగపూర్ డీసీపీ రాహుల్ మదానే వెల్లడించారు. గడ్కరీ కార్యాలయం వద్దే కాక, ఆయన పాల్గొనే కార్యక్రమాల వద్ద కూడా భద్రత పెంచుతున్నట్టు వివరించారు.
Advertisement
Nitin Gadkari
Threats
Calls
Office
Nagpur
Police
Maharashtra

More Telugu News