ద్రావిడ్ కు అనారోగ్యం.. బెంగళూరులోని నివాసానికి చేరుకున్న హెడ్ కోచ్
- అనారోగ్యంతోనే నిన్న రెండో వన్డేకు సేవలందించిన ద్రావిడ్
- ఈ తెల్లవారుజామున కోల్ కతా నుంచి బెంగళూరుకు పయనం
- తిరువనంతపురం మ్యాచ్ కు దూరం
ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోల్ కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయల్దేరారు. అనారోగ్యం నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగే చివరి వన్డేకు ద్రావిడ్ అందుబాటులో ఉండరు. మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది.