నెంబర్ వన్ పిరికిపంద జగన్ తీసుకొచ్చిందే జీవో నెంబర్ వన్: పట్టాభి

  • టీడీపీని ఎదుర్కొనే ధైర్యం జగన్ కు లేదన్న పట్టాభి 
  • ప్రతిపక్షాలు రోడ్లపై తిరిగితే భయం ఎందుకని ప్రశ్న 
  • సైకో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శ 
మన దేశంలోనే నెంబర్ వన్ పిరికిపంద ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ నేత పట్టాభి ఎద్దేవా చేశారు. టీడీపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే, ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే జీవో నెంబర్ 1ను తీసుకొచ్చారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ పాదయాత్రకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని... ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రతిపక్షాలు రోడ్లపై తిరిగితే ఎందుకు భయపడుతున్నారని అన్నారు. 

ఆనం రాంనారాయణ రెడ్డి వంటి వైసీపీ ఎమ్మెల్యేలే ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఈరోజు కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని అన్నారు. సైకో సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని... ఈ దుర్మార్గుడిపై అందరూ తిరగబడాలని చెప్పారు. చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నా ప్రజలు ఆయనకు తోడుగా నిలబడి కుప్పంలోకి తీసుకెళ్లారని అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.


More Telugu News

Pattabhi Telugudesam Jagan YSRCP