మొబైల్ వాడకమే ఆ 89 మంది ప్రాణం తీసింది..: రష్యా
- కొత్త ఏడాది నాటి క్షిపణి దాడిలో సైనికుల మరణాలపై రష్యా వివరణ
- మొబైల్ సిగ్నళ్లను ట్రాక్ చేసి ఉక్రెయిన్ దాడి చేసిందని వెల్లడి
- ఫోన్లు వాడొద్దన్న ఆదేశాలను సైనికులు ఉల్లంఘించారని వ్యాఖ్య
- బాధ్యులపై చర్యలు తప్పవన్న ఆర్మీ
బార్డర్ కు దగ్గరగా ఉండడంతో మొబైల్ ఫోన్లు వాడొద్దని శిబిరంలోని సైనికులకు ఆదేశాలు జారీ చేసినట్లు రష్యన్ ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన సైనికులు.. కొత్త ఏడాది సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులతో ఫోన్లో మాట్లాడారని వివరించారు. ఈ మొబైల్ ఫోన్ల సిగ్నళ్లను ట్రాక్ చేసి, సైనికులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన ఉక్రెయిన్.. క్షిపణుల వర్షం కురిపించిందని తెలిపారు. కచ్చితత్వంతో జరిగిన ఈ దాడిలో రష్యా పెద్ద మొత్తంలో సైనికులను కోల్పోయినట్లు వివరించారు.
ఈ దాడిలో చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది సైనికులు ఇటీవలే యుద్ధంలో చేరారని రష్యా లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ సెవ్ర్యకోవ్ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సైనికులపై చర్యలు తప్పవని ఆ వీడియో సందేశంలో సెర్గీ స్పష్టంచేశారు.