పవన్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలి: అంబటి రాంబాబు

Ambati Rambabu fires on Pawan Kalyan
  • కాపులను చంద్రబాబు మోసం చేశారన్న అంబటి
  • ప్రశ్నించిన ముద్రగడను చంద్రబాబు వేధించారని మండిపాటు
  • చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్న అంబటి
కాపుల విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని, దీన్ని కాపులు అర్థం చేసుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసింది చంద్రబాబు అని... దీన్ని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు వేధించారని చెప్పారు. ముద్రగడ కుటుంబ సభ్యులను కూడా వేధించారని అన్నారు.

 అంత జరిగినా ఆనాడు చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చంద్రబాబు హయాంలో కాపులు ఉద్యమం చేస్తే మద్దతు ఇవ్వని పవన్... ఇప్పుడు జగన్ హయాంలో ఉద్యమం చేస్తే ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కాపులు అర్థం చేసుకోవాలని చెప్పారు.
Advertisement
Ambati Rambabu
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News