చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం 40 మందిని బలితీసుకుంది: విడదల రజని
- చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదన్న మంత్రి
- జనాలను మభ్యపెట్టి సభలకు తీసుకొస్తున్నారని వ్యాఖ్య
- రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా చంద్రబాబుకు మద్దతుగా లేదన్న రజని
రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా చంద్రబాబుకు అనుకూలంగా లేరని చెప్పారు. చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవంలో 40 మంది ప్రాణాలను బలితీసుకున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దని ఆయనకు సూచిస్తున్నామని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నామని... కొందరికి ఇంకా పరిహారం అందలేదని, వారికి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.