చంద్రబాబును అరెస్ట్ చేయాలి.. ఆయన సభలకు అనుమతిని ఇవ్వకూడదు: జోగి రమేశ్
- గుంటూరు సభ తొక్కిసలాటలో ముగ్గురి మృతి
- ఇవి చంద్రబాబు హత్యలే అన్న జోగి రమేశ్
- బాబును రాష్ట్రంలో తిరగనిస్తే మరింత మంది బలైపోతారని వ్యాఖ్య
నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలి తీసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మరో ముగ్గురుని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సరం రోజున సంతోషంగా గడపాల్సిన వారికి విషాదాన్ని మిగిల్చారని విమర్శించారు. ఈ మరణాలకు కారణమైన చంద్రబాబును అరెస్ట్ చేయాలని అన్నారు. చంద్రబాబు సభలకు అనుమతిని ఇవ్వొద్దని డీజీపీని కోరుతున్నానని చెప్పారు. చంద్రబాబును రాష్ట్రంలో తిరగనిస్తే ఆయన మరింత మందిని బలి తీసుకుంటారని అన్నారు. బాబు అధికార దాహానికి ప్రజలు బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.