NTR: ఎన్టీఆర్, కొరటాల చిత్రం రిలీజ్ డేట్ ఇదే!

NTR movie with Koratala Siva set to release in 2024
షార్ట్స్‌లో చూడండి
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి కొత్త చిత్రమేమీ రాలేదు. అయితే కొరటాల శివతో ఎన్టీఆర్ అంగీకరించిన సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం నేడు ప్రకటించింది. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కల్యాణ రామ్ నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ పంచుకుంటామని యువసుధ ఆర్ట్స్ వెల్లడించింది.
Go Back to Shorts
NTR
Koratala Siva
NTR30
Release Date
Tollywood

More Telugu News