పార్లమెంటులో మెట్లు దిగుతూ జారిపడిన శశి థరూర్... కాలికి గాయం

Shahsi Tharoor injured in Parilament
  • నిన్న పార్లమెంటు సమావేశాలకు హాజరైన థరూర్
  • ఎడమకాలు బెణకడంతో ఆసుపత్రికి పయనం
  • కాలుకు బ్యాండేజితో తన నివాసానికే పరిమితం
  • నియోజకవర్గంలో కార్యక్రమాల రద్దు
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పార్లమెంటులో మెట్లు దిగుతూ గాయపడ్డారు. నిన్న పార్లమెంటు సమావేశాలకు హాజరైన థరూర్... మెట్లు దిగే క్రమంలో జారిపడ్డారు. ఎడమ కాలు బెణకడంతో ఓ దశలో నడవడానికి ఇబ్బంది పడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లారు. కాలుకు బ్యాండేజ్ వేయించుకున్న థరూర్ తన తన నివాసానికే పరిమితమయ్యారు. 

ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉన్నానని, నియోజకవర్గంలో కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ట్వీట్ చేశారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడించారు. కాగా, థరూర్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Go Back to Shorts
Shashi Tharoor
Injury
Ankle Twist
Left Leg
Congress
Parliament

More Telugu News