బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి దూరంగా కేటీఆర్
- ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం
- హైదరాబాద్ లోనే ఉన్న కేటీఆర్
- జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో కేటీఆర్ సమావేశం
జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పార్టీ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నట్టు సమాచారం. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు.