Chandrababu: ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రంపై ప్రకటనలా?: చంద్రబాబు

Chandrababu questions YCP leaders
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రంపై ప్రకటనలా? అంటూ సజ్జలపై పరోక్షంగా మండిపడ్డారు. సమైక్యాంధ్ర అంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసపూరితం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం అని వెల్లడించారు.

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరం అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వ్యవసాయరంగంలో రికార్డులు సాధించామని చంద్రబాబు అన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. సత్వరం స్పందించి అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
YCP Leaders
Sajjala Ramakrishna Reddy
Andhra Pradesh
TDP
YSRCP

More Telugu News