తమిళ హీరో విజయ్ రీమేక్ చిత్రంలో పవన్ కల్యాణ్?

Pawan Kalyan to remake Vijay movie
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్
  • విజయ్ 'తెరి' సినిమాను రీమేక్ చేసే యోచనలో పవన్
  • తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించే ప్రయత్నం 
ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో పవన్ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇటీవలే వెలువడింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాను ప్రకటించినప్పటికీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యమవుతోంది.

మరోవైపు, తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'తెరి' సినిమాను రీమేక్ చేయాలనే యోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 'పోలీసోడు' పేరుతో తెలుగులో డబ్బింగ్ గా రిలీజ్ అయింది. పోలీసుల నుంచి టైటిల్ పై అభ్యంతరాలు రావడంతో పేరును 'పోలీస్'గా మార్చారు. ఇదే సినిమాను పూర్తిగా తెలుగు నేటివిటీకి, పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించాలని భావిస్తున్నారని సమాచారం. అయితే 'హరిహర వీరమల్లు', సుజీత్ సినిమాలు పూర్తయిన తర్వాతే విజయ్ సినిమా రీమేక్ ను చేపడతారని తెలుస్తోంది. 
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Tollywood
Vijay
Movie
Remake

More Telugu News