నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు
- ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటన
- ఇప్పటికే 60 వేలకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయన్న సీఎస్
- త్వరలో 16,940 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని వెల్లడి
ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.