ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు... కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి: ఏపీ మంత్రి అప్పలరాజు
- పలాసలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అప్పలరాజు
- ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామన్న మంత్రి
- ప్రతిపక్షాలు, మీడియా వైసీపీని ఏమీ చేయలేవని వ్యాఖ్య
- అప్పలరాజు వ్యాఖ్యలను వారించిన ధర్మాన కృష్ణదాస్
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చంటూ అప్పలరాజు వ్యాఖ్యానించారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నామని కూడా ఆయన వైసీపీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేశారు. వైసీపీని ప్రతిపక్షాలతో పాటు ఆ పార్టీలకు వంత పాడుతున్న మీడియా కూడా ఏమీ చేయలేవన్నారు. ఇదిలా ఉంటే...ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్.. అప్పలరాజు వ్యాఖ్యలను వారించారు.