కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!
- నగరిలో క్రీడా సంబరాలను ప్రారంభించిన రోజా
- పలు ఆటలను ఆడి అలరించిన మంత్రి
- క్రీడాకారిణులను ప్రోత్సహించిన రోజా
ఈ సందర్భంగా రోజా కబడ్డీ ఆడుతూ రెయిడ్ కు వెళ్లారు. అవతలి జట్టులో ఉన్న అమ్మాయిలు రోజాను టాకిల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వెల్లికిలా కిందకు పడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అలా కిందపడేస్తారా? అంటూ అధికారులు, ఆమె అనుచరులు విద్యార్థినులను అంటుండగా... రోజా కలగజేసుకుని ఎవరినీ ఏమనొద్దని వారించారు. అంతేకాదు, స్పోర్టివ్ స్పిరిట్ తో ఆమె మరో రెయిడ్ కు కూడా వెళ్లారు. అమ్మాయిలను రోజా ప్రోత్సహించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.