చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోల మృతి
- మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు
- పోమ్రా-హల్లూర్ అటవీ ప్రాంతంలో 40 మంది మావోల సమావేశం
- పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలు
- ఒకరికొకరు ఎదురుపడడంతో కాల్పులు
ఈ క్రమంలో ఇరు వర్గాలు తారసపడడంతో వారి మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి చెందారు. బలగాలు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. రెండు మృతదేహాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడినట్టు చెప్పారు.
ఘటనా స్థలం నుంచి 303, 315 రైఫిళ్లతోపాటు మూడు ఆయుధాలు, మందుపాతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 2వ తేదీ నుంచి 8 వరకు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగానే మావోయిస్టులు అక్కడ సమావేశమైనట్టు పోలీసులు భావిస్తున్నారు.