రష్యాకు షాక్.. ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్
- ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా యుద్ధం
- రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న తీర్మానానికి 494 మంది మద్దతు
- రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించేందుకు అమెరికా నిరాకరణ
క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్, సిరియా దేశాలను ఉగ్రవాద ప్రోత్సాహక దేశాల జాబితాలో చేర్చిన అమెరికా.. రష్యాను మాత్రం ఆ జాబితాలో చేర్చేందుకు నిరాకరించింది. అయితే, యూరోపియన్ పార్లమెంట్ మాత్రం ఓటింగ్ నిర్వహించి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.