మంత్రి మల్లారెడ్డి కొడుకు ఆసుపత్రిలో చేరడంపై రఘునందన్ రావు సెటైర్లు
- మహేందర్ రెడ్డి నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారన్న రఘునందన్
- ఐటీ రెయిడ్స్ ప్రారంభం కాగానే గుండెపోటు ఎలా వస్తుందని ప్రశ్న
- తప్పులు చేయకపోతే మల్లారెడ్డి ఫోన్ ఎందుకు దాచారన్న రఘు
మహేందర్ రెడ్డి నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారని... ఐటీ రెయిడ్స్ ప్రారంభం కాగానే ఆయనకు గుండెపోటు ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి తన ఫోన్ ను దాచి పెట్టారని... అయినా ఐటీ అధికారులు ఆ ఫోన్ ను కనిపెట్టారని చెప్పారు. తప్పులు చేయకపోతే ఫోన్ దాచి పెట్టాల్సిన అవసరం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని... దీనిపై ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు.