Andhra Pradesh: చర్చిల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించిన ఏపీ ప్రభుత్వం

AP Government allocates 175 Cr for churches
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో చర్చిల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. రూ. 175 కోట్లతో చర్చిల నిర్మాణం, చర్చిల మరమ్మతులు, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున అందించనుంది. జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. క్రైస్తవుల శ్మశానాల ఆధునికీకరణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 19వ తేదీలోగా ప్రతిపాదనలను అందించాలని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Churches
Funds
YSRCP

More Telugu News