Varun Tej: తెలుగు తెరకి పరిచయమవుతున్న మరో బ్యూటీ!

Manushi Chillar in Varun Tej Movie
షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెర కొత్త హీరోయిన్స్ కి ఎప్పుడు ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో ఇద్దరు ముగ్గురు దూసుకుపోతుంటే, మిగతావారు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అఖిల్ సినిమా 'ఏజెంట్' ద్వారా సాక్షి వైద్య కథానాయికగా పరిచయం కానుంది. ఇక కల్యాణ్ రామ్ చేస్తున్న 'అమిగోస్' ద్వారా ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. 

ఈ నేపథ్యంలోనే మరో ముంబై భామ పేరు తాజాగా వినిపిస్తోంది. ఆ ముద్దుగుమ్మ పేరే 'మానుషి చిల్లార్'. పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన ఈ సుందరి, 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆమె ఒక తెలుగు సినిమాను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అదీ వరుణ్ తేజ్ సరసన. 

వరుణ్ తేజ్ హీరోగా ఆయన 13వ సినిమా పట్టాలెక్కనుంది. బడా నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి సినిమా. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ యాక్షన్ డ్రామాతోనే మానుషి చిల్లార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
Go Back to Shorts
Varun Tej
Manushi Chillar
Shakthi Prathp Singh Movie

More Telugu News