ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
- మైనింగ్ లీజు వ్యవహారంలో సొరేన్ పై కేసులు
- హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
- సత్యమేవ జయతే అని సొరేన్ ట్వీట్
తాము తీర్పును వెలువరించేంత వరకు ఈ పిటిషన్లపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీం ఆదేశించింది. ఈ రోజు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్టు ప్రకటించింది. దీనిపై హేమంత్ సొరేన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'సత్యమేవ జయతే' అని రాసుకొచ్చారు. మరోవైపు ఇదే అంశంలో హేమంత్ సొరేన్ కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. అయితే, ఆయన మాత్రం ఇంతవరకు ఈడీ విచారణకు హాజరుకాలేదు.